నరకాసుర వధకు కాళికలై కదలిరండి

మ‌హిళ‌ల‌ను కాపాడ‌లేని చంద్ర‌బాబు రాఖీ శుభాకాంక్ష‌లు చెప్పే అర్హ‌త లేదు
ఎమ్మెల్యే ఆర్కే రోజా

నరకాసుర వధకు మహిళలు భద్రకాళికలై తరలిరావాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఒకపక్క రాష్ట్రంలో మహిళలను వేధిస్తూ.. మరోవైపు మహిళా సాధికారత అంటూ చంద్రబాబు వల్లమాలిన ప్రేమ నటిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహిళను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చేతకాని ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెబుతాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో సూదిగాళ్ల పాలన నడుస్తుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్ట పగలు కూడా నడవలేయపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాళకేయుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ఆమె పేర్కొన్నారు. 
కంత్రీ కేబినెట్‌ మంత్రులు ఉన్నారు
దేశంలోనే నలుగురు మంత్రులపై లైంగిక ఆరోపణలున్నాయని తేలితే అందులో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన మంత్రులుండటం సిగ్గు చేటన్నారు. ఒక మహిళా కేంద్ర మంత్రిని కూడా వేధించిన చరిత్ర ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులుండటం దౌర్భాగ్యమన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి నిత్యం మహిళా ఉద్యోగులను వేధిస్తున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు మెస్‌ చార్జీలు పెంచమని విశాఖలో పోరాడితే జుట్టు పట్టి లాగారు. 
తుందు్రరులో ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదించిన మహిళలను బట్టలు చించి కొట్టారు. అంగన్‌వాడీ మహిళలను బ్లౌజులు చినిగిపోయేలా కొట్టారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌తో బెదిరించి ఎంతో మంది అమాయక మహిళలను వ్యభిచారంలోకి దించేశారు. దానికి కారణమైన బోండా ఉమ,బుద్ధా వెంకన్న వంటి వారిని వెనకకేసుకు రావడమేనా మహిళా సాధికారత.. అంటే చంద్రబాబును ఉద్దేశించి ఆమె మండిపడ్డారు. కార్యకర్తల స్థాయి నుంచి మంత్రుల వరకు మహిళలను నిత్యం హింసిస్తున్నారని తెలిపారు. దీనికి టీడీపీ మహిళా నాయకులు కూడా మినహాయింపు కాదన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ టీడీపీ మహిళా నాయకులపై దాడులు చేసినా చంద్రబాబులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానీమూన్‌ వంటి వారు మీడియా ముందుకొచ్చి తమపై జరుగుతున్న వేధింపులపై ఆమె మీడియా ముందుకొచ్చి వాపోయిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నారాయణ కాలేజీలో 25 మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కేసు నమోదు చేయలేదు. మంత్రి నారాయణను కూడా భర్తరఫ్‌ చేయకుండా కొనసాగించడం దారుణమన్నారు. ఆయనిచ్చే డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని దించే దిశగా మహిళలు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.  నరకాసురుడిని వ«ధకు కాళికా మాతలుగా రావాలి. 
Back to Top