వైఎస్సార్సీపీదే విజయమంటున్న ఓటర్లు

ఫ్యాన్ గుర్తుకే ప్రజల ఓటు..!
సంక్షేమ పథకాలే గెలుపుకు మెట్లు..!

వరంగల్ః
ఓరుగల్లు పార్లమెంట్ ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని..పార్టీ
అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి,
 వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారానే మేలు
జరుగుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుత
ప్రభుత్వాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రజలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని
నల్లా సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. రాజయ్య వ్యవహారంతో కాంగ్రెస్
నామరూపాల్లేకుండా పోయిందని, బీజేపీకి టీడీపీ వెన్నుపోటు పొడుస్తున్న
పరిస్థితి కనిపిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించాలని
ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పారు.  

నామినేషన్
వేసిన అనంతరం వైఎస్సార్సీపీ అన్ని నియోజకవర్గాల్లో ఒకసారి
చుట్టిముట్టిందని నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. ప్రచారపర్వంలోగానీ,
అభివృద్ధిలో గానీ.. ఇతర రాజకీయ పార్టీలు తమతో పోటీపడే పరిస్థితే లేదన్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మూడ్రోజుల సుడిగాలి పర్యటనలో... ప్రజలు
పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారన్నారు. తమ నాయకుడు పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఫలించాయన్నారు. అదేవిధంగా తమ అధ్యక్షులు
వైఎస్ జగన్ వరంగల్ పర్యటనతో..తాము భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని
నల్లా సూర్యప్రకాష్ అన్నారు.  
Back to Top