హోదా దీక్ష మరింత ఉధృతం

– సమర దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు
– 10న రహదారుల దిగ్బంధం
– 11న రైల్‌ రోకోలు
 అమరావతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. ఈ మేరకు కార్యాచరణను పార్టీ ప్రకటించింది . వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల సమరదీక్షకు మద్దతుగా ఈ నెల 10, 11వ తేదీల్లో చేపటô ్ట ఆందోళన కార్యక్రమాలను వెల్లడించింది. ఈ నెల 10న అన్ని నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధం, 11న రైల్వే స్టేషన్లలో రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది. సమర దీక్ష కొనసాగినంత కాలం నియోజకవర్గ కేంద్రాలో రిలే దీక్షలు కొనసాగిస్తారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top