చేతులు జోడించి స్పీకర్‌ను కోరాం

ఢిల్లీ: తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని చేతులు జోడించి స్పీకర్‌ను కోరినట్లు ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌ను అభ్యర్థించారు. సభ్యుల ఆందోళనతో 30 సెకండ్లకే లోక్‌సభను మధ్యాహ్నంకు వాయిదా వేశారు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని, పార్ల‌మెంట్ సాక్షిగా ఇస్తామ‌న్న హ‌క్కును ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. హోదా ఇచ్చే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

 

తాజా ఫోటోలు

Back to Top