నాలుగోసెట్ నామినేషన్ పత్రాలపై మేకపాటి సంతకం

న్యూఢిల్లీః బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నాలుగోసెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వైయస్సార్సీపీ తరపున ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ  సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్ని విధాలా అర్హుడన్నారు. అత్యధిక మెజార్టీతో రామ్‌నాథ్‌ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Back to Top