మూడు రోజుల్లో 'జగన్‌ కోసం' లక్ష సంతకాలు

హైదరాబాద్, 5 జనవరి 2013: 'జగన్ కోసం.. జనం సంతకం'‌ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు గౌతంరెడ్డి లక్షకు పైగా సంతకాలు సేకరించారు.‌ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కేవలం మూడు రోజుల్లోనే ఆయన ఈ సంతకాలు సేకరించారు. హైదరాబాద్ లోట‌స్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ ‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను కలిసి 1.06 లక్షల సంతకాలతో ఉన్న పత్రాలను ‌గౌతంరెడ్డి అందజేశారు.
Back to Top