మొద‌లైన రైతు భ‌రోసా యాత్ర‌..!

అనంత‌పురం : అనంత‌పురం జిల్లా లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర మొద‌లైంది. 
చంద్ర‌బాబు
నాయుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్ని తుంగ‌లో తొక్క‌టంతో రైతులు
అప్పుల ఊబిలో కూరుకొని పోయారు. ఖ‌రీఫ్ సీజ‌న్ గ‌డుస్తున్నప్ప‌టికీ రైతుకు
అప్పు దొరికే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. రుణ మాఫీ జ‌ర‌గ‌క పోవ‌టంతో
అప్పుల మీద వ‌డ్డీలు త‌డిసి మోపెడ‌య్యాయి. దీంతో కొన్ని చోట్ల రైతులు
ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొంటున్నారు. అటువంటి కుటుంబాల్ని ప‌రామ‌ర్శించ‌టంతో
పాటు రైతు లోకంలో స్థైర్యాన్ని నింపేందుకు ఈ యాత్ర‌ను ఉద్దేశించారు.
ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా సాగిన యాత్ర‌.. మూడోద‌శ అనంత‌పురంలో సాగుతోంది.
మొద‌టి రోజు అనంత‌పురం జిల్లాలోని క‌ళ్యాణ దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో
ప‌ర్య‌టిస్తున్నారు.
Back to Top