ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి

బంగారుపాళెంః ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులను కట్టబెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రం బంగారుపాళెం తహశీల్దార్‌కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైయస్సార్‌సీసీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సియం, స్పీకర్, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top