బాబుతో ఎమ్మెల్యేల భేటీ..నిధుల వివక్షపై మండిపాటు

విజయవాడః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తమ నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు. నిధుల కేటాయింపులో వివక్షపై ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని...ఓడిపోయిన వాళ్లకు, పార్టీ ఫిరాయించిన వాళ్లకు నిధులు కట్టబెట్టడంపై మండిపడ్డారు. అంతకుముందు  స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి క్యాంపు ఆఫీసు వరకు ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టారు.

Back to Top