కలిసి ఉండాలనే రాజధానిని వదులుకున్నాం

హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2013:

తెలుగు భాష మాట్లాడే ప్రజలంతా ఒక్కటిగా కలిసి ఉండాలనే సదాశయంతోనే కర్నూలు రాజధానిని సీమాంధ్రులు వదులుకున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అనేక చిక్కు సమస్యలకు ఏమాత్రం పరిష్కారం చూపించకుండా రా‌ష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా విభజిస్తుందని ఆయన ప్రశ్నించారు. అత్యధిక శాతం ప్రజ అభీష్టానికి అనుగుణంగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశారు కాబట్టే సీమాంధ్ర ప్రజలు ఉద్యమిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పరిష్కారం చెప్పకుండా ముందుకు వెళతామంటే ఒప్పుకునేది లేదని ఆయన కరాఖండిగా చెప్పారు.

Back to Top