ఎమ్మెల్యే రాజాకు ముస్లింల ఆశీస్సులు

తుని : రంజాన్‌ పండుగ సందర్భంగా నమాజ్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత ముస్లింలు శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఆశీస్సులు అందజేశారు. సోమవారం ముస్లిం పెద్దలు మిఠాయిలను రాజాకు తినిపించారు. ఈద్‌ ముబారక్‌ చెప్పారు. భవిష్యత్‌లో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్సార్‌ సీపీ కో అర్డనేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ముస్లిం సోదరులకు రంజాన్ విషెస్ తెలియజేశారు.  మాజీ కౌన్సిలర్‌ భాషా శాలువతో రాజాను సత్కరించారు. ఎస్‌కే. క్వాజా, షేక్‌ బాబ్జి, ఆలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top