న‌మ్మించి మోసం చేసిన చంద్ర‌బాబు

ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పవాణి మండిపడ్డారు. ఢిల్లీ మ‌హాధ‌ర్నాలో ఆమె మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన ఒ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవనీ కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పుతున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమంపై వైయ‌స్‌ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో మాయ చేసే స్వభావం చంద్రబాబుదన్నారు. ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి వైయ‌స్‌ జగన్‌ అని తెలిపారు.  ప్రత్యేక హోదా కోసం వైయ‌స్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి సైతం సిద్ధమయ్యారని, వైయ‌స్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.
Back to Top