ఇంటికెళ్లే ముందైనా టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోండి

 


చిత్తూరు:  తెలుగు దేశం పార్టీ నేత‌లు ఇంటికి వెళ్లే ముందైనా వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సూచించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న రావ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో అవాకులు, చ‌వాకులు పేల్చుతున్నార‌ని మండిప‌డ్డారు. ప్రజాసంకల్పయాత్రపై విమర్శలు చేసే మంత్రులు అవివేకులు అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజాసంకల్పయాత్ర ఎలా సాగుతుందో వచ్చి చూస్తే తెలుస్తుందని చుర‌క‌లంటించారు. గురువారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో చిత్తూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని మండిపడ్డారు. చంద్రబాబు తన సొంత నియోజక వర్గాన్నే అభివృద్ధి చేయలేక పోయారని విమర్శించారు. ఉపాధి కోసం కుప్పం ప్రజలు లక్షలాది మంది రోజు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తన నియోజక వర్గానికి సాగు, తాగు నీరు ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీని మూసేసి రైతులకు త్రీవ అన్యాయం చేశారని పెద్దిరెడ్డి విమర్శించారు. వైయ‌స్‌ఆర్ హయంలో షుగర్‌ ఫ్యాక్టరీలకు ప్రాణం పోసి రైతులకు మేలు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత షుగర్‌ ఫ్యాక్టరీలు మళ్లీ ముతపడ్డాయన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు.
 

తాజా ఫోటోలు

Back to Top