ఇఫ్తార్‌ విందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విరాళం

సదుం: మండలంలోని పలు మసీదులలో ఇఫ్తార్‌ విందుకు వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరాళం అందజేశారు. విరాళాలను స్థానిక పంచాయతీ కార్యాలయంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి మసీదు పెద్దలకు శుక్రవారం పంపిణీ చేశారు. సదుంలోని జామియా మసీదుకు రూ. 15 వేలు, మదీనా, జాండ్రపేటలోని ఇఖ్లాస్‌ మసీదులకు రూ. 5 వేల చొప్పున, అగ్రహారంకు రూ. 3 వేలు, ఊటుపల్లెకు రూ. 5 వేలు, చింతపర్తివారిపల్లెకు రూ. 3 వేలు, చెరుకువారిపల్లెకు రూ. 4 వేలు, బూరగమందకు రూ. 3 వేలు, దేవదారమాకులపల్లెకు రూ. 3 వేలు, చింతలవారిపల్లెకు రూ. 4 వేలు, పొలికిమాకులపల్లెకురూ. 4 వేలు చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సయ్యద్‌బాషా, నాయకులు ఖాజాపీర్, ఖమ్రుద్దీన్, బషీర్, కాలేషా, ఇమ్రాన్, అంజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top