ఎమ్మెల్యే పెద్దిరెడ్డిచే ఆలయాలకు ఆర్థిక సహాయం

పుంగనూరు మండలంలోని వివిధ ఆలయాలకు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోదరుడు , జెడ్పిమాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపిపి నరసింహులు పంపిణీ చేశారు. మండలంలోని కల్లుపల్లె, అరవపల్లె, కొత్తూరు, ఏడూరు ఆలయాలకు రూ.10 వేలు చొప్పున పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని యూత్‌ కోసం డ్రమ్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామబాట పర్యటనలో భాగంగా ప్రజలు, యువకుల నుంచి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు ఆలయాలకు నిధులు, బళ్లారి డ్రమ్స్, క్రీకెట్‌ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని ప్రజల కోరిక మేరకు వారికి అవసరమైన వస్తువులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు సుబ్బన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top