వైయస్ఆర్‌సీపీలో చేరిన మళ్ళ, కరణం

హైదరాబాద్ :

'స్థానిక', సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చే‌రుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యువ జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పలువురు నాయకులు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్‌, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు శ్రీ వైయస్ జగ‌న్ సమక్షంలో ‌పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.‌ పార్టీ కండువాలు వేసి వీరిని శ్రీ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ధర్మశ్రీ, విజయ్‌ ప్రసాద్‌ వెంట విశాఖ నాయకులు సింగరాజు సుబ్బరాజు (కామత్‌రాజు) కూడా వచ్చి శ్రీ జగన్‌ను కలుసుకున్నారు.

Back to Top