కంట‌త‌డి పెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

  • సీనియ‌ర్ సిటీజ‌న్స్ భ‌వ‌నాన్ని కూల్చేసిన అధికార పార్టీ నేతలు, అధికారులు
  • ధ్వంసం చేసిన చోటే మ‌ళ్లీ మందిరాన్ని పున‌ర్‌నిర్మిస్తాం
  • ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి
  • నెల్లూరు: అధికార పార్టీ నేత‌లు, అధికారుల ఆగ‌డాల‌కు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆవేద‌నకు గురయ్యారు. నెల్లూరు పొద‌ల‌కూరు వ‌ద్ద వృద్ధులు రూపాయి, రూపాయి పోగు చేసుకొని క‌ట్టుకున్న విశ్రాంతి భ‌వ‌నాన్ని కార్పొరేష‌న్ అధికారులు కూల్చేయ‌డంతో ఎమ్మెల్యే కంట‌త‌డి పెట్టుకున్నారు. సంఘ‌ట‌న స్థ‌లాన్ని చూసి ఒక్క‌సారిగా సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. పొద‌ల‌కూరులో వంద‌లాది మంది సీనియ‌ర్ సిటీజ‌న్లు కూడ‌బెట్టుకున్న సొమ్ముతో, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఒక నెల జీతంతో కుల‌మ‌తాల‌కు అతీతంగా కార్ప‌రేష‌న్ పర్మీష‌న్స్‌తో విశ్రాంతి మందిరాన్ని నిర్మించారు. ఇంకో 15 రోజుల్లో ప్రారంభం చేసుకుందామ‌నుకునే స‌మ‌యంలోనే 100 మంది పోలీసులు స‌హ‌కారంతో అధికారులు వ‌చ్చి జేసీబీల‌తో రెప్ప‌పాటులో కూల్చివేశారు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆ ప్రాంతాన్ని చూసి క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రాజ‌కీయాల్లో ఇంత దుర్మార్గాలు ఉంటాయ‌ని క‌ల్లో కూడా అనుకోలేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేగా మాట‌లు చెప్పి త‌ప్పించుకోకుండా శ‌క్తి మంచి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి కృషి చేస్తున్నాన‌న్నారు. దాత‌లు, స్నేహితులు, త‌న నిధుల‌తో వాట‌ర్ ప్లాంట్‌లు, పేద విద్యార్థుల‌కు ఆర్థిక స‌హాయం, పార్కుల అభివృద్ధి, శ్మ‌శాన‌వాటిక‌లు నిర్మించాన‌న్నారు. సీనియ‌ర్స్ సిటీజ‌న్స్ ఇళ్ల‌లో ఒంట‌రిగా ఉంటున్నామ‌ని, మా క‌ష్ట‌సుఖాలు చెప్పుకోవ‌డానికి, మేమంద‌రం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవ‌డానికి ఒక షెల్ట‌ర్ క‌ట్టించండి అని త‌న దృష్టికి తీసుకువ‌చ్చార‌న్నారు. దీంతో సిటీజ‌న్స్ పొగు చేసుకున్న డ‌బ్బు, త‌న నిధులు, ఇత‌ర దాత‌ల స‌హాయంతో కుల‌మ‌తాల‌కు అతీతంగా ఒక షెల్ట‌ర్‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. భ‌వ‌న నిర్మాణానికి క‌మిష‌న‌ర్ ప‌ర్మీష‌న్ కూడా ఇచ్చార‌న్నారు. ఇంకో 15 రోజుల్లో ప్రారంభం చేసుకుందామ‌నుకునే స‌రికి అధికారులు భ‌వ‌నాన్ని కూల్చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మా వాళ్లు పొర‌బాటు చేశార‌ని క‌మిష‌న‌ర్ చెప్ప‌డం బాధాక‌ర‌మ‌ని ఎమ్మెల్యే అన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆరు నూర‌యినా అంద‌మైన మందిరాన్ని దుర్మార్గంగా ధ్వంసం చేసిన చోటే మ‌ళ్లీ పున‌ర్ నిర్మాణం చేప‌డుతామ‌న్నారు. ఈ దుర్మార్గానికి ఒడిగ‌ట్టిన వ్య‌క్తుల‌కు భ‌గ‌వంతుడు త‌గిన శిక్ష విధిస్తాడ‌ని హెచ్చ‌రించారు.
Back to Top