వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం

 
నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇద్దామని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. నాయుడిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడారు. సుల్లూరుపేట నియోజకవర్గాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. పక్కనే స్వర్ణముఖి నది, మరోవైపు ఇంకో నది ప్రవహిస్తున్నా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌ మన కొరకు 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తున్నారని, ప్రజల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో ఆయన తెలుసుకుంటున్నారన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క సమస్య తీరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మన వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చేసి చూపిస్తారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మూడు సెజ్‌లు ఏర్పాటు చేశారని, ఆ సెజ్‌ల్లో స్థానికుల్లో స్కావేంజర్స్,  పనులు ఇస్తున్నారని, ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. పక్క రాష్ట్రాల వారిని ఇక్కడికి రప్పించి ఉద్యోగాలు కల్పించారన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక సెజ్‌ల్లో ఇక్కడున్న వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వైయస్‌ జగన్‌ తరఫున మాట ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను తీర్చి వైయస్‌ఆర్‌ ఆశయాన్ని వైయస్‌ జగన్‌ నెరవేర్చుతారని చెప్పారు. నదుల్లో చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తే ఇక్కడ భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. తెలుగుగంగ ద్వారా మద్రాస్‌కు నీరు తీసుకెళ్తున్నారని కానీ, మాకు నీరు ఇవ్వడం లేదన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కాల్వను రెగ్యులరైజ్‌ చేసి రైతులకు నీరిస్తామన్నారు. అతిపెద్ద ఉప్పునీటి సదస్సు అయిన పులికాట్‌పై అనేక మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అలాంటి సదస్సు ప్రాధాన్యత కోల్పోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ఇక్కడికి వస్తున్నారని హడావుడిగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, అలాంటి జీవోలను ప్రజలు నమ్మరని, వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు మేలు చేస్తారన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను వైయస్‌ జగన్‌ నెరవేర్చుతారని చెప్పారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని వైయస్‌ జగన్‌  మరింత మెరుగు పరిచి పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తారని చెప్పారు. 

 
Back to Top