వైయస్‌ జగన్‌కు మైక్‌ ఇవ్వకపోవడం దారుణం

ఏపీ అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీపై సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మైక్‌ ఇవ్వకపోవడం దారుణమని ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఏపీలో ఉన్న ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుని పరీక్షలు రాస్తున్నారని, అయితే నారాయణ కాలేజ్‌ నుంచి పేపర్‌ లీక్‌ కావడం దురదృష్టకరమన్నారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని ధ్వజమెత్తారు. ఈ అంశంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెడితే దానిపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. నారాయణ కాలేజ్‌లోని విద్యార్థులు మాత్రమే మంచి ర్యాంకులతో పాస్‌ కావాలా? మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌పై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణ తప్పుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top