ప్ర‌జా ప్ర‌తినిధుల్ని పిల‌వ‌రా-ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న‌

పెదపూడి : మహాసంకల్ప దీక్షప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ, పార్టీ కార్య‌క్ర‌మంగా మారిపోయింద‌ని వైయ‌స్సార్సీపీ శాస‌న‌స‌భ ప‌క్షం డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌, ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న అభిప్రాయ ప‌డ్డారు. దీనికి  ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను పిలవకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె అన్నారు. క్రిష్ణా జిల్లా మండలం మొవ్వ మండ‌లం పెద‌పూడి ఉప సర్పంచ్ చిగురుపల్లి కనకదుర్గ నివాసంలో  విలేకరులతో మాట్లాడారు. కడపలో టీడీపీ నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష ప్రజలకు ఉపయోగపడకపోగా ఉద్యోగులను, అధికారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిధులు వృథా చేయకుండా అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రికరించాలని ఆమె సూచించారు.

 టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు. డ్వాక్రా వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 14న శంకుస్థాపన చేసిన ఎన్‌టీఆర్ గృహకల్ప పథకం ద్వారా 6 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం 51 రోజులు గడిచినా అర్హుల లిస్ట్‌నే పంపలేదని, ఇళ్ల నమూనా, మెటీరియల్ వివరాలు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. నీరు చెట్టు పథకం ద్వారా మట్టి, ఉచిత ఇసుక పథకం ద్వారా ఇసుక అమ్మకాల ద్వారా టీడీపీ నేతలు కోటాను కోట్లు కొల్లగొడుతున్నార ని ఆరోపించారు.


యద్దనపూడి మాజీ సర్పంచ్ పులి కిరణ్‌బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు రాజులపాటి మురళి, సీహెచ్ ఏడుకొండలు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యద ర్శి తాతా శేషుబాబు పాల్గొన్నారు. అనంతరం నరసంపాలెం గ్రామానికి చెందిన కైలా వెంకటేశ్వరరావు అల్లుడు మరణించడంతో  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
Back to Top