చంద్రబాబు మోసకారి –ఎమ్మెల్యే ఐజయ్యనందికొట్కూరు: సీఎం చంద్రబాబు మోసకారి అని, ఆయనపై ఈ నెల 8న పోలీసు స్టేషన్లలో కేసులు పెడతామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో మోసపూరితమైన మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క వాగ్ధానం నెరవేర్చలేదన్నారు.ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని, రైతు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత చేతులు ఎత్తేయడం దుర్మార్గమన్నారు. హామీలను నేరవేర్చకుండా ప్రజల సొమ్ముతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న సీఎంను ప్రజలే చెప్పులతో కొడతారన్నారు. సమావేశంలో కౌన్సిలరు చంద్రశేఖరరెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పద్మనాభరెడ్డి, అవాజ్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అబుబక్కర్, తదితరులు పాల్గొన్నారు.   
Back to Top