రాజన్న రాజ్యాన్ని జగనన్న తెస్తాడు

 
చిత్తూరు: త్వరలో రాజన్న రాజ్యాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెస్తారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రామచంద్రాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారన్నారు. పురిటి బిడ్డను తీసుకొని వచ్చి కూడా మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి ఆనందపడుతున్నారన్నారు. అదే మన నాయకుడిపై ఉన్న నమ్మకమని చెప్పారు. పురిటి బిడ్డను కూడా అన్న కాపాడగలడన్న నమ్మకం వారిలో ఉందన్నారు. మనందరం కూడా వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పాత రోజులు మళ్లీ రావాలంటే, పాడి పంటలు విరజిల్లాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. భవిష్యత్తు మనదే అని, విజయం మనదే అని నినదించారు. రామరాజ్యం వస్తుందని చెవిరెడ్డి చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top