యువతకు వైయస్సార్సీపీ పెద్దపీట

తిరుపతిః చంద్రగిరి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహించిన టోర్నమెంట్స్ ముగిశాయి. మొత్తం మూడొందలకు పైగా టీమ్స్...6వేలకు పైగా క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని చెవిరెడ్డి పేర్కొన్నారు. గెలిచిన వారికి వైయస్ఆర్ మెడలు, సర్టిఫికెట్ తో పాటు ట్రోఫీ, లక్ష రూపాయల నగదు ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామీణులనుంచి క్రీడలను ప్రోత్సహించాలన్న వైయస్ఆర్ ఆశయ సాధన కోసం వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. యువతకు వైయస్సార్సీపీ పెద్దపీట వేస్తుందని చెవిరెడ్డి స్పష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top