రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

చిత్తూరు: ఏనుగుల భీభత్సంతో పంట నష్టపోయిన అన్నదాతలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గ పరిధిలోని చిలగొట్టికల్లు, ఎ్రరవారిపాలెం మండలాల్లో ఏనుగుల భీభత్సంతో చిట్టేచర్ల, దేవరకొండ గ్రామ పంచాయతీ పరిధుల్లో మామిడి, టమాటా పంటలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top