సీమాంధ్రను అగ్నిగుండంగా మార్చిన కాంగ్రెస్

తిరుపతి, 15 ఆగస్టు 2013:

ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అగ్నిగుండంగా మారడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గురువారం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమంలో భూమన పాల్గొన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజల కళ్లలో కాంగ్రెస్‌ పార్టీ కారం కొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కారం పొట్లాలను భూమన పంపిణీ చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన కారణమని ఈ సందర్భంగా మాట్లాడిన భూమన ఆరోపించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ‌ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అభివర్ణించారు. శ్రీమతి విజయమ్మ దీక్ష ప్రకటనతో కాంగ్రెస్-టిడిపి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. శ్రీమతి విజయమ్మ నిరవధిక నిరశన దీక్షకు సీమాంధ్ర ప్రజలు మద్దతుగా ఉంటారని భూమన ధీమా వ్యక్తంచేశారు.

Back to Top