సంతలో పశువుల్లా సర్పంచ్‌ పదవులకు బేరాలు

తిరుపతి, 15 జూలై 2013:

సంతలో పశువులను బేరం పెట్టిన చందంగా సర్పంచ్‌ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని, ఇది హేయమైన చర్య అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు‌ అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులకు దిగుతున్నాయని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విధానాలను కాంగ్రెస్, ‌టిడిపిలు బహిరంగంగా ఖూనీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. చివరకు మీడియాపైన కూడా దాడులు చేసేందుకు కూడా ఆ రెండు పార్టీలు వెనుకాడడం లేదని భూమన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Back to Top