మంత్రులిద్దరినీ బర్తరఫ్ చేయాలి

ఏపీ అసెంబ్లీః రాష్ట్రంలో పద్ధతి ప్రకారం ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లోని పిల్లలకు ర్యాంకుల కోసం పేపర్ లీకేజ్ లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.  మొదట టెన్త్ పేపర్ లీకేజే కాలేదని ప్రభుత్వం బుకాయించిందని, తాము డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నివేదక బయటపెట్టిన తర్వాత పేపర్ లీకయిందని ఒప్పుకున్నారని వైయస్ జగన్ తెలిపారు. తొమ్మిదన్నరకు పరీక్ష ప్రారంభమైతే ఐదు నిమిషాల ముందే నారాయణ కాలేజ్ ఎంప్లాయ్  సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి నారాయణ కాలేజ్ కు సంబంధించిన స్టాప్స్ కు పంపించారని, వారు ఆన్సర్ రూపకంగా దాన్ని చేరవేసి పరీక్షలు రాయిస్తావుంటే...ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, మోసంగా కనిపించడం లేదా అని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. నారాయణ కాలేజ్ కు సంబంధించిన ఉద్యోగి ఆ ప్రశ్నాపత్రాన్ని ఇంకా ఎవరెవరికి పంపించాడో సీబీఐ ఎంక్వైరీ వేస్తే మొత్తం బయటపడుతోందన్నారు. నెల్లూరులోని నారాయణ హైస్కూల్లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజి వ్యవహారంపై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో వైయస్ జగన్ ప్రభుత్వం తీరును కడిగి పారేశారు

డిసిప్లనరీ యాక్షన్ తీసుకున్నామన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నాపత్రం వాట్సాప్ లో వ్యాపించిందంటున్నారు? మరి అలాంటప్పుడు ఎందుకు పరీక్ష క్యాన్సిల్ చేయలేదని నిలదీశారు. లక్షలాదిమందికి సంబంధించిన వ్యవహారం ప్రభుత్వానికి చిన్నదిగా కనిపించడం బాధాకరమన్నారు. వాళ్ల స్టూడెంట్స్ కు ఈ మాదిరిగా పేపర్ లీకే చేసి పంపిస్తుంటే నారాయణ యాజమాన్యాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. డైరెక్టర్ డీఈవో 26న కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ 28న ఫైల్ చేశారు. ఇంకో ఆశ్చర్యకర విషయమేమంటే..ఇది ఒక్క నెల్లూరులో మాత్రమే జరగలేదని చాలా చోట్ల పేపర్ లు లీకవుతున్నాయని వైయస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరును ఎండగడ్డారు. సాక్షాత్తు నారాయణ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం మంత్రిది. ఆయన  వియ్యంకుడు గంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ . దీనికి బాధ్యులైన వీరిద్దరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.  

పేపర్ లీకేజ్ అయి బయటకొస్తుంది, యాక్షన్ తీసుకోవాలని మంచి సిటిజన్ గా సాక్షి రిపోర్టర్ బయటపెడితే...అది తప్పన్నట్టుగా ప్రభుత్వం ఆ ఉద్యోగిపై నిందలు వేయడం దారుణమన్నారు. ర్యాంకులు సంపాదించుకునేవాడు కష్టపడి చదివి ర్యాంకులు రావాలని ఆరాటపడతాడు.  కానీ నారాయణ కాలేజీలో లక్షల ఫీజులు కడితే మాత్రమే ర్యాంకులొస్తాయని ప్రభుత్వమే దగ్గరుండి సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు. పేపర్ లీకేజ్ ఘటనపై అటెండర్లు, ఇన్విజిలేటర్లపై యాక్షన్ తీసుకొని చేతులు దులుపుకోవడం కాదని...మంత్రి నారాయణను ఆయనకు సపోర్ట్ చేసిన గంటాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఇన్సిడెండ్ జరిగితే ముద్దుక్రిష్ణమనాయుడు రిజైన్ చేశారు. వేరే రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా జరిగితే ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం చూశామన్నారు. నారాయణ పిల్లలకు ర్యాంకులొచ్చేలా పేపర్ ను లీక్ చేస్తుంటే...ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే, సీబీఐ ఎంక్వైరీ జరిపించాల్సింది పోయి... దీన్ని చిన్నవిషయంగా ప్రభుత్వం కొట్టిపారేయడం దారుణమన్నారు. చంద్రబాబు తన మంత్రులను కాపాడుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. 

Back to Top