రైతులకు ముఖం చాటేసిన మంత్రి గారు


గుంటూరు
జిల్లా ప్రత్తిపాడులో తాగునీరు, సాగునీటి
సమస్య తీవ్రంగా ఉంది. ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా
పోతోందని ప్రజలు వాపోతున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు మీదుగా
పెదనందిపాడు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు.. మంత్రి కిషోర్
బాబుకి తమ సమస్యలు చెప్పుకొందామని అనుకొన్నారు.

          ఈ
లోగా అక్కడకు చేరుకొన్న పోలీసులు.. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం అంటూ
హడావుడి చేశారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటూ రైతులు
చెప్పుకొన్నారు. ఈ లోగా మంత్రి కిషోర్ బాబు కాన్వాయ్ దారి మళ్లించుకొని బైపాస్
రోడ్ మీదుగా వెళ్లిపోయారు. కనీసం ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం
చేయకపోవటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

      

          పంటలు పండక, సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా..
ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు కూడా
సరిగా జరగడం లేదని నిరసన తెలిపారు. చివరకు మంత్రి వెళ్లిపోయారన్న సమాచారం
తెలుసుకున్న రైతులు.. అక్కడ్నుంచి వెనుదిరిగారు.

 

Back to Top