<br/>హైదరాబాద్) చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నచూపు అని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సమస్యల్ని తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నేతన్నలకు అండగా నిలవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా, చేనేత కార్మికులకు ఎటువంటి మేలు కలగలేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారని ఆయన అన్నారు.<br/>