<br/>నెల్లూరు: అమరావతి శంకుస్థాపన ఎపిసోడ్ మీద వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నుంచి మట్టి తీసుకువచ్చారు కానీ.. పార్లమెంట్లో ఇచ్చిన హామీలను విస్మరించారని వారు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మోదీని అడిగే సాహసం చేయలేకపోయారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.