లోకేష్‌ను కాపాడేందుకే దిగ‌జారుడు రాజ‌కీయాలు

హైద‌రాబాద్‌:  ప‌చ్చ త‌మ్ముళ్లు త‌మ పార్టీ అధినేత కుమారుడు నారా లోకేష్‌ను కాపాడుకునే క్ర‌మంలో దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజ‌మోహ‌న్ రెడ్డి సోమ‌వారం విడుద‌ల చేసిన ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత చంద్ర‌మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌జ‌లెవ్వ‌రు న‌మ్మ‌బోర‌ని మేక‌పాటి తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను తాను క‌ల‌వ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో త‌మ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను చంద్ర‌మోహ‌న్ వ‌క్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఇటువంటి వ్యాఖ్య‌ల్ని క‌నీసం చంద్ర‌బాబు అయినా న‌మ్ముతారా? అని మేక‌పాటి ప్ర‌శ్నించారు. 

చిన‌రాజ‌ప్ప‌ను కింద కూర్చొబెట్టి, లోకేష్ పెద్ద‌రికం వ‌హించ‌డంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంద‌న్నారు. ముందుగా లోకేష్ పెద్ద‌ల్ని గౌర‌వించ‌డం నేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఎవరిని సంతోష పెట్టేందుకు చంద్ర‌మోహ‌న్ దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు తెర తీశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  చంద్ర‌మోహ‌న్ ఇలాంటి చౌక‌బారు స్టేట్‌మెంట్లు ఇప్ప‌టికైనా మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి త‌న‌కు మ‌ధ్య పుకార్లు లేవ‌దీసే ప‌ద్ధ‌తి చూస్తే చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఎంత అన్యాయం అయిపోయాడో అర్థ‌మ‌వుతుందన్నారు. 
Back to Top