మేకపాటికి మరోసారి వైద్య పరీక్షలు

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలోని ఏపీభవన్‌ ప్రాంగణంలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఉదయం పరీక్షలు నిర్వహించిన వైద్యులు 73 ఏళ్ల వయస్సున్న మేకపాటి ఒక్కరి పరిస్థితి కొంచెం ఆందోళనగా ఉందని చెప్పారు. ఏపీ హక్కులను కాపాడడం కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రెండ్రోజులుగా దీక్షలు చేస్తున్నారు. కాగా మేకపాటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్షను విరమించాలని సూచించారు. అయితే, దీక్షను విరమించేందుకు మేకపాటి నిరాకరించారు. ప్రత్యేక హోదాపై ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేయనని అన్నారు

తాజా ఫోటోలు

Back to Top