మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం

కోడుమూరు(కర్నూలు):

మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలంగాణ జిల్లాల్లో యాబై వేల మందితో ఘన స్వాగతం పలుకుతామని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్ బోడ జనార్దన్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఆమె పాదయాత్రకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కర్నూలు జిల్లాల్లో యాత్ర చేస్తున్న షర్మిలను రంగారెడ్డి జిల్లా నేతలు కోడుమూరు నియోజకవర్గంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారామెతో మాట్లాడారు. 

Back to Top