మరో ప్రజాప్రస్థానానికి నేతల సంఘీభావం

మహబూబ్‌నగర్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్రకు ఆదివారం పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్ శివభరత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కసునూరు రఘునాథరెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బి.హర్షవర్ధన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, మద్దిరాల విష్ణువ ర్ధన్‌రెడ్డి, మాచిరెడ్డి భగవంత్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి తదితరులు షర్మిల వెంట నడిచారు.

Back to Top