మరో ప్రజా ప్రస్థానం.. అంతటా హర్షాతిరేకం

పాదయాత్ర హక్కు వైయస్ కుటుంబానిదే: జలీల్ ఖాన్

పాదయాత్ర చేసే హక్కు రాజశేఖరరెడ్డి కుటుంబానికి మాత్రమే ఉందని విజయవాడకు చెందిన పార్టీ నేత జలీల్ ఖాన్ స్పష్టంచేశారు.  వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ఎవరికోసమని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వంపై ఆయన అవిశ్వాసం పెట్టగలరా అని ప్రశ్నించారు. అనేక సందర్భాలలో తాను తన కుమార్తె సలహాలు కూడా తీసుకున్నానని రాజశేఖరరెడ్డి చెప్పేవారన్నారు. యాత్ర వార్త ముఖ్యంగా మహిళల్లో ఆనందోత్సాహాలను నింపుతోందన్నారు. మీ వెంట మేముంటామని అన్ని వర్గాల ప్రజలు ప్రకటిస్తున్నారన్నారు.  విద్యుత్తు, తదితర సమస్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

షర్మిల యాత్రను ఘనంగా ఆహ్వానిస్తారు: అంబటి

వాస్తవానికి ఇది వైయస్ జగన్ చేయాల్సిన యాత్రని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. జైలు నుంచి విడుదలయిన తర్వాత మొదలెట్టాలనుకున్నారనీ,  ప్రభుత్వ కుట్ర కారణంగా ఆయన జైలునుంచి విడుదల కాలేకపోవడంతో షర్మిల ఇందుకు పూనుకుంటున్నారనీ వివరించారు. జగన్ మాదిరిగానే షర్మిల యాత్రను ఘనంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నామన్నారు. కడప జిల్లా వరకూ తొలుత రూట్ మ్యాప్ విడుదల చేస్తామనీ,  కొంతకాలం తర్వాత పూర్తి వివరాలు ప్రకటిస్తామనీ చెప్పారు. ఏ జిల్లాలో ప్రవేశించనుంటే ఆ వివరాలను తెలియజేస్తామన్నారు తండ్రి చనిపోయి, అన్న జైలులో ఉన్న పరిస్థితులలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను తనపై వేసుకున్నారనీ ప్రశంసించారు. 'ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. నష్టాల్లో ఉన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకుని ప్రభుత్వంపైనా, ప్రతిపక్ష నేతపైనా వత్తిడి పెంచేందుకే మరో ప్రజాప్రస్థానానికి పూనుకున్నారు. జగన్ విడుదలయ్యే వరకూ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా సాహసోపేతమైన యాత్ర.' అని అంబటి కితాబిచ్చారు. వైయస్ పాదయాత్రకు రెట్టింపు చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా సాహసమన్నారు. కుటుంబం కష్టం కంటే ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని తండ్రి చెప్పారంటూ షర్మిల యాత్రకు నడుం బిగించారురనీ, ఆమె ద్వారా ప్రజలు తమ కష్టాలు, నష్టాలు జగన్ కు చేరవేస్తారని భావిస్తున్నామనీ పేర్కొన్నారు. "చంద్రబాబు 'వస్తున్నా మీకోసం పాదయాత్ర పదో రోజుకు చేరింది. ఆయన తిరిగి  స్వర్ణ యుగాన్ని తెస్తానంటున్నారు. రెండుసార్లు ప్రజలు  ఆయనను తిరస్కరించిన విషయాన్ని మరిచారు." అని ఎద్దేవా చేశారు. బాబు ఆయన యాత్రకు కారణం జగన్. ప్రజల మధ్యకు రావడం ఇదే ప్రథమం. ఓదార్పు యాత్రలో జగన్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. దీనిని చూసి అలా మారితే తప్ప ఓట్లు పడవని బాబు కపట నాటకాన్ని ఆడుతున్నారు. ఎంతకాలం సాగుతుందో చూద్దాం. దీనిని ప్రజలు తిరస్కరిస్తారు. ఎవర్ని గుండెలకు హత్తుకుంటారో చూద్దామని అంబటి చెప్పారు.

కడపలో.. 

ఇది ఎంతో శుభ దినం. ఆనందకరమని కడప జిల్లాలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చెప్పారు.  ఈ పాదయాత్రతో వైయస్ జగన్ సీఎం అవుతారని తెలిపారు. డీఎల్ రవీంద్రారెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని చెప్పిన వైనం బట్టి అధికార, విపక్షాలు కుమ్మక్కయిన అంశం వెల్లడవుతోందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు రూ. 500 పింఛను రావడం వైయస్ భిక్షన్నారు. సమస్యలు రాజ్యమేలుతున్న సమయంలో షర్మిల పాదయాత్ర మంచి పరిణామమని చెప్పారు. దీనికి భయపడైనా ప్రభుత్వం కొన్ని సమస్యలైనా తీరుస్తుందని ఆశిస్తున్నామన్నారు.  షర్మిల యాత్ర ముందు.. ఇందిరమ్మ బాట, వస్తున్నా మీకోసం వెలవెలబోతాయని జోస్యం చెప్పారు. వైయస్ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలందరికీ తెలుసనీ, షర్మిలకు బ్రహ్మరథం పడతారనీ తెలిపారు. ఈ యాత్రను ప్రజలు సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖిస్తాన్నారు. 

శ్రీకాకుళం..

వైయస్ తన ప్రజాప్రస్థానాన్ని శ్రీకాకుళం జిల్లలో ముగించారనీ, షర్మిల చేపడుతున్న యాత్రను జిల్లా మహిళలంతా స్వాగతిస్తున్నారనీ ఆ జిల్లా మహిళలు చెప్పారు. తన కుటుంబం ఎదుర్కొంటున్న అన్ని బాధలు పక్కన పెట్టి యాత్ర చేపట్టడం సాహసోపేతమని అభివర్ణించారు. షర్మిల ప్రచారానికి ఉప ఎన్నికల్లో ఎంతో స్పందన వచ్చిందనీ,  ఇది కూడా విజయవంతమవుతుందనీ అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ పథకాల అమలుపై ఈ యాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ పరిణామంతో ఆనందిస్తున్నారన్నారు. అంతా మా అమ్మాయి వస్తోందని అనుకుంటున్నారన్నారు. 
 
విశాఖపట్నం..

రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషిస్తున్న రోజిది. మా సమస్యలు తెలుసుకోవడానికి షర్మిల రానుండడం ఎంతో ఆనందం. జగన్ చేస్తున్న యాత్రల వల్లే కొంత మంచి చేకూరింది. మహిళలకు చాలా ఉత్సాహంగా ఉంది. వైయస్ ప్రతి మనిషి దగ్గరికీ వెళ్ళారు. సమస్యలు తెలుసుకున్నారు. ఏ మహిళా పాదయాత్ర చేసిన దాఖలా దేశంలోనే లేదు. షర్మిల ఎప్పుడెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నాం.
ప్రజలకు భరోసా కల్పించడానికే షర్మిల పాదయాత్ర: భూమన
ప్రజల కడగండ్లను తీరుస్తామనే భరోసా కల్పించడానికే షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. చంద్రబాబు అధికార దాహంతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల ప్రజా సంక్షేమ కోసం మొదలు పెడుతున్నారని వివరించారు. వైయస్ ప్రజల బాధలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారన్నారు. అధికారం కోసం చేయలేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top