'మహానేత ఉంటే మూడోసారి ముఖ్యమంత్రయ్యేవారు'

నెల్లూరు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే మూడోసారీ ముఖ్యమంత్రి అయ్యుండేవారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లో మూడోసారి కూడా బీజేపీ నేత నరేంద్రమోడీ విజయం సాధించడాన్ని బట్టి ఆ పార్టీ నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు, పట్టం కడతారని తెలిపారు. మన రాష్ట్రంలో ఒంటిచేత్తో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత  మహానేతకే దక్కుతుందని చెప్పారు. దటీజ్ లీడర్‌షిప్ అంటూ కొనియాడారు. ఆ మహానేత మరణానంతరం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని అదేస్థాయిలో రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఈనెల 24న కోర్టు తీర్పు ఉందని, క్రిస్మస్ ముందురోజే జగన్ విడుదలై ప్రజలముందుకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Back to Top