మహానేత పథకాలు నిర్వీర్యం

మేళ్లచెరువు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యడవల్లి కృష్ణ అన్నారు. నల్గొండ జిల్లా మండలం దొండపాడులో విలేకరులతో మాట్లాడారు. మహానేత సీఎంగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపారని గుర్తుచేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తిరిగి అమలు కావాలంటే శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సీఎం కావాలని అభిలషించారు. రాబోయే సహకార సంఘం ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చిలకల శ్రీనివాసరెడ్డి, పెండెం ముత్యాల్ గౌడ్, నాయకులు వేముల శేఖర్‌రెడ్డి, కస్తాల రామయ్య, కొత్తమద్ది గోవిందరెడ్డి, ఎన్‌టీఆర్, ఎన్నారై దొండపాటి రాధారెడ్డి, గోళ్ల నర్సింహారెడ్డి, మధిర శ్రీనివాసరెడ్డి, దొంగల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Back to Top