కలిసికట్టుగా పోరాడితేనే హోదా సాధ్యం

  • ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న బాబు
  • బాబు వైఖరికి నిరసనగా 27న రాష్ట్రవ్యాప్త నిరసనలు
  • జల్లికట్టు, తెలంగాణ స్ఫూర్తితో కలిసికట్టుగా పోరాడుదాం
  • రెండేళ్లలో ప్రజల ప్రభుత్వం వస్తుంది
  • అందరం ఒక్కటై హోదాను సాధించుకుందాం
  • పిల్లలపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేస్తాంః వైయస్ జగన్
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధనకు అందరం ఒక్కటై పోరాటం చేద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు సర్కార్‌ ఉక్కుపాదంతో అణచివేసిందని, బాబు వైఖరికి ఈ నెల 27న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు తలపెడుతున్నట్లు ఆయన చెప్పారు. విశాఖ నుంచి తిరిగివచ్చిన అనంతరం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..రాష్ట్రంలోని ప్రతి యువకుడు, చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగాలు దొరకడం లేదు. చంద్రబాబు పుణ్యానా ఏపీలో వరుసగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజేస్‌ దాదాపు 26 వేల పరిశ్రమలు మూతపడుతున్నాయని రిపోర్టులు ఇస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. పిల్లలకు మళ్లీ ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవని అని తెలిసి కూడా బాబు దగ్గరుండి, హోదా అన్న మాట ఎవరి నుంచి వచ్చిన, ఎవరైనా పోరాటం చేసినా..ఉక్కుపాదంతో అణచివేసే తీరు ఈ రోజు చూశాం. ప్రత్యేక హోదా అన్న హామీని సాక్ష్యాత్తుగా సీఎం వెన్నుపోటు పొడటం అందరం బాధపడాల్సిన విషయం. ఇవాళ విశాఖలో శాంతియుతంగా నిరసన తెలపాలని వెళ్తే..రిపబ్లిక్‌డే సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరించింది. ప్రతి యువకుడు గాంధేయపద్ధతిలో క్యాండిల్‌ ర్యాలీ చేయాలని వస్తే నిర్ధాక్షిణంగా దాడులు చేశారు, కేసులు పెట్టారు. వేల మందిని అరెస్టు చేయడం, వైయస్‌ఆర్‌సీపీ నాయకులను ఎక్కడపడితే అక్కడ హౌస్‌ అరెస్టులు చేయడం, తమ్మినేని సీతారాంను జీవులో తీసుకెళ్లడం, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మధును అరెస్టు చేయడం దుర్మార్గం. 

ఇవాళ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే రన్‌వే మీదానే నిలుపుదల చేశారు. అక్కడ ఐదారు మందిమి ఉన్నాం. వందల మంది పోలీసులు వచ్చి రన్‌ వే మీదా ఆపారు. ప్రతిపక్ష నాయకుడ్ని, ఇద్దరు ఎంపీలను, ఇక మాజీ ఎమ్మెల్యేను ఆపారు. ఎవరైనా ఆపాలంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు అధికారం లేదు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ప్యాసింజర్లుగా ఉన్న మమ్మల్ని డొమస్టిక్‌ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కార్‌లో పనిచేసే కొంత మంది పోలీసు అధికారులకు చెబుతున్నా..మీరు సెల్యూటీ కొట్టాల్సింది మూడు సింహాలకు మాత్రమే..వాటి వెనుక ఉన్న గుంటనక్కలకు కాదు. హోదా కోసం పోరాటం చేస్తున్న నాయకులు, పిల్లలు రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఆరాటపడుతున్నారు. అంటే పోలీసుల పిల్లల కోసం కూడా అన్నది మరిచిపోకూడదు. ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అక్కడికి వచ్చి ప్రయాణికులను రన్‌వే మీద ఆపి రోడ్డుపై కోర్చోబెట్టడం సరికాదు. వీటన్నింటి మీదా విచారణ జరుగుతుంది. దోషులందరి మీదా చర్యలు తీసుకుంటాం. పిల్లలపై కేసులు పెట్టారు. ప్రతి పిల్లాడికి భరోసా ఇస్తున్నా..కేసులకు ఎవరు భయపడొద్దు. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి కేసు తీసేస్తా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బాబు పరోక్షంగా ఉండి హోదాను ఖూనీ చేస్తున్న వ్యక్తిని దేవుడు కూడా క్షమించడు. ప్రజలు కూడా క్షమించరు. 

ఇవాళ చంద్రబాబు వైఖరికి నిరసనగా, ప్రత్యేకహోదాకు అడ్డుతగులుతున్న వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27న ఆందోళనలు చేపట్టాలని పిలుపునిస్తున్నా. ప్రత్యేక హోదా అన్నది మనకు ఇస్తామన్న హామీ. దాన్ని చంద్రబాబు లాంటి వ్యక్తి నీరుగార్చాలని చూస్తే ఊరుకోం. హోదా కోసం అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. వ్యతిరేకిస్తున్న చంద్రబాబులాంటి వ్యక్తిని గట్టిగా ఎదుర్కొందాం. బాబు ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలుపుదాం. తమిళనాడులో జరిగిన జల్లికట్టు అన్న ఉద్యమంపై వెటకారంగా మాట్లాడుతున్నారు. జల్లికట్టు కోసం తమిళనాడు ప్రజలు కలిసికట్టుగా చేసిన ఉద్యమానికి మేం ముగ్ధులమయ్యాం. సీఎం స్థాయి వ్యక్తి కూడా ప్రధానిని కలిసి సాధించారు. అలాంటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం. చంద్రబాబు లాంటి వ్యక్తి స్వాతంత్య్రానికి ముందు ఉంటే మనకు స్వాతంత్య్రం వచ్చేది కాదు. బాబు లాంటి వ్యక్తి పోవాలి. జాబు రావాలంటే బాబు పోవాలి. సుజనాచౌదరి, చంద్రబాబు లాంటి వ్యక్తుల మాటలు వింటుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది. ఎన్నికల ముందు వీళ్లు కాదా చెప్పింది. హోదా ఐదేళ్లు ఇస్తే ఎలా? అభివృద్ధి ఆగిపోదా అన్నారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు నాడు పార్లమెంట్లో పదేళ్లు కావాలని డిమాండ్‌ చేయలేదా? ప్రధాని ఎన్నికల ప్రచారంలో హోదా ఇస్తామని చెప్పలేదా? ఇన్ని అబద్ధాలు చెప్పే నాయకులు నిజంగా నాయకులేనా? ఇలాంటి నాయకులను చూస్తే బాధనిపిస్తుంది.
 
Back to Top