పదే పదే ప్రతిపక్ష నేత మైక్ కట్

అసెంబ్లీః బడ్జెట్ పద్దులపై ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకుండా ప్రభుత్వం గొంతు నొక్కుతోంది. వైయస్ జగన్ మాట్లాడుతుండగా పదే పదే మైక్ కట్ చేస్తోంది. అడుగడుగునా ప్రతిపక్ష నేత ప్రసంగానికి అధికార టీడీపీ అడ్డుతగులుతోంది. నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు చెబుతున్నదేంటి..? చేస్తున్నదేంటి అని వైయస్ జగన్ నిలదీశారు. వైయస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చర్చను తప్పుదోవపట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. 

Back to Top