లక్షల ఎకరాలు దోచుకున్నారు

విశాఖ: విశాఖ జిల్లాలో భూ స్కాంలో వేలాది ఎకరాలు దోచుకున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగుడివాడ అమర్ నాథ్ రెడ్డి  మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఈ స్కామ్‌లో భాగస్యామ్యం ఉందన్నారు. అలాంటి పాలకులు ఉండటం మన ధౌర్భగ్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను, సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అన్ని సమస్యలకు వైయస్‌ జగన్‌ పరిష్కరిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దుబారా ఖర్చులకు మన నుంచే వసూలు చేస్తున్నారన్నారు. సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి, అనవసరంగా జరిమానాలు విధించి వసూలు చేస్తున్నారన్నారు. సింగపూర్‌ కడుతానని చెప్పిన చంద్రబాబు స్విమ్మింగ్‌ ఫూల్‌ కట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు.
Back to Top