కుదుటపడిన షర్మిల ఆరోగ్యం

హైదరాబాద్, 26 జనవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఆరోగ్యం కుదుటపడింది. శ్రీమతి షర్మిల నడవ గలిగే స్థితిలో ఉన్నారని ఆమెను పరీక్షించిన అపోలో వైద్యులు తెలిపారు. వైద్యుల సలహా కోసం ఆమె అపోలో ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ చంధ్రశేఖరరెడ్డి, మరో డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి శ్రీమతి షర్మిలకు పరీక్షలు నిర్వహించారు.  ప్రస్తుతం ఎలాంటి ఆసరా లేకుండా శ్రీమతి షర్మిల నడవొచ్చని డాక్టర్లు చెప్పారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారన్నారు.  కొన్ని రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందన్నారు.

      అపోలో వైద్యులు శనివారంనాడు శ్రీమతి షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మోకాలి గాయంతో
బాధపడుతున్న శ్రీమతి షర్మిలకు డిసెంబర్ 18వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స
చేశారు. అప్పటి నుంచి శ్రీమతి షర్మిల విశ్రాంతి తీసుకుంటున్నారు.

Back to Top