కృష్ణా జిల్లాలో మహానేత విగ్రహావిష్కరణ

గుడివాడ23 మార్చి 2013:

కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని జొన్నపాడు గ్రామంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవిష్కరించారు. శనివారం ఉదయం ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, కొడాలి నాని, ఎంవీఎస్ నాగిరెడ్డి మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైయస్ఆర్ మరణంతో రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

Back to Top