కొవ్వూరు బహిరంగ సభ రద్దు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా  చేతికందిన పంట నష్టపోయి రైతు తీరని కష్టంలో ఉన్నాడనీ, అందుకనే సభను రద్దు చేశామనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. ఆ సభలో పార్టీలో చేరాలనుకున్న వారు హైదరాబాద్ వచ్చి పార్టీలో చేరతారని చెప్పారు. సీనియర్ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు), తదితరులు ఆదివారం హైదరాబాద్‌లోని  పార్టీ ప్రధాన కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే బాబాజీరావు, డాక్టర్ కర్రా రాజారావు, కోడూరి శివరామకృష్ణ, వి. రామచంద్రరావు, కొఠారు రామచంద్రరావు

Back to Top