నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు

హైదరాబాద్ః నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని..వాటన్నంటిపై చర్చ జరిగేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఉన్న ఐదురోజుల్లోనైనా ప్రధాన అంశాలపై చర్చిద్దామంటే..ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలంతా రెచ్చగొట్టే రీతిలో మాట్లాడడం దారుణమన్నారు.

 రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్న పరిస్థితి. కల్తీమద్యం, నిరుద్యోగులు ఇలా ఎన్నో సమస్యలున్నాయి. ప్రజాసమస్యలపై చర్చ కోసం అధ్యక్ష మైక్ అని ప్రతిపక్ష నేత గగ్గోలు పెట్టిన మాట్లాడే అవకాశం ఇవ్వలేదని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న దుర్మార్గాన్ని స్పీకర్ రక్షిస్తున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. సమస్యలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే సమావేశాలను బాయ్ కాట్ చేశామన్నారు.   వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top