రంజాన్ ప్రార్ధ‌న‌ల్లో కోటంరెడ్డి

నెల్లూరు రూర‌ల్ః రంజాన్ పండుగ మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ములుముడిలో ముస్లింల‌తో క‌లిసి రంజాన్ ప్రార్ధ‌న్‌ల్లో పాల్గొన్నారు. అదే విధంగా బ‌రాషాహీద్ ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేసి ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ ముస్లిం మైనారిటీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

Back to Top