కేసీఆర్ దూకుడు చ‌ర్య‌లు మానుకోవాలి

హైద‌రాబాద్‌ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు దుందుడుకు చ‌ర్య‌లు మానుకోవాల‌ని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రావు హెచ్చ‌రించార‌రు. ఆచ‌ర‌ణ సాధ్యం అయ్యే హామీల‌ను ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నుంచి నోటీసులు రాక‌ముందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల‌ని ఆయ‌న సూచించారు. లేక‌పోతే వారిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న అన్నారు. దీనిపై కేసీఆర్ వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు.
Back to Top