జిల్లా,మండలాల మధ్య చిచ్చు కేసీఆర్ ఘనతే

- కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బ‌య‌ట‌కు రావాలి
- సీఎం సొంత జిల్లాలోనే గాడి త‌ప్పిన పాల‌న‌
- మెద‌క్ జిల్లాకో న్యాయం... ఇత‌ర జిల్లాల‌కు మ‌రోన్యాయామా..?
తంబులాలు ఇచ్చి... త‌న్నుకొని చావండి అన్న చందాన జిల్లాల విభ‌జ‌న‌
-టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్‌

హైద‌రాబాద్‌: తంబులాలు ఇచ్చి.. త‌న్నుకొని చావండి అన్న చందంగా తెలంగాణ జిల్లాల విభ‌జ‌న ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్ టీఆర్ఎస్ సర్కార్ పై ధ్వ‌జ‌మెత్తారు. లోట‌స్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌కు ఆయ‌న సొంత జిల్లా మెద‌క్‌లోని సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సీఎం సొంత జిల్లా మెద‌క్‌లో అధికారుల వేధింపులు భ‌రించ‌లేక.... తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని సబ్ ఇన్స్‌పెక్ట‌ర్ రివాల్వ‌ర్‌తో కల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం గుర్తు చేశారు. 

64 మండ‌లాలు ఉన్న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 7 రెవెన్యూ డిజిజ‌న్ల‌ను చేశార‌ని... 46 మండ‌లాలు ఉన్న మెద‌క్ జిల్లాను మూడు జిల్లాలుగా విభ‌జిస్తూ ఏడు రెవెన్యూ డివిజ‌న్‌లు చేయ‌డం ఎంత‌మేరకు స‌మంజ‌స‌మ‌ని ప్రశ్నించారు. 10 మండ‌లాలు ఉన్న మ‌ల్కాజ్‌గిరిని జిల్లాగా చేయడం దారుణమన్నారు. ఎన్నో ఉద్య‌మాలు, ఎంతోమంది ఆత్మ‌బ‌లిదానాల‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని శివకుమార్ అన్నారు.  స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటాలు చేసిన‌ట్టే..ఇప్పుడు  జిల్లాలు, మండ‌లాలు, గ్రామాల కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని శివ‌కుమార్ కేసీఆర్ పాల‌న‌పై నిప్పులు చెరిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర‌ాల మ‌ధ్య చిచ్చు ఉండ‌గా... కొత్త‌గా జిల్లాలు, మండ‌లాల మ‌ధ్య చిచ్చు పెట్టిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కింద‌న్నారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
()జిల్లాల విభ‌జ‌న‌కై రెవెన్యూ మంత్రి డ్రాప్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి కేవ‌లం ఐదు రోజులు మాత్ర‌మే అయ్యింది. నోటిఫికేష‌న్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ఫిర్యాదులు వ‌చ్చాయి
()నోటిఫికేష‌న్‌పై ఫిర్యాదుల‌కే ఇంకా 25 రోజుల గ‌డువుంద‌ి. అప్ప‌టి వ‌ర‌కు ఫిర్యాదులు ల‌క్ష‌కు చేరుకున్నా ఆశ్చ‌ర్యం చెందాల్సిన అవ‌స‌రం లేదు
ఇప్ప‌టి వ‌ర‌కు వచ్చిన ఫిర్యాదుల‌న్నీ కేవ‌లం ఆన్‌లైన్ లోనివే. ఇంకా, త‌హ‌శీల్దార్‌, క‌లెక్ట‌ర్ల‌కు వంద‌ల సంఖ్య‌లో ఫిర్యాదులు అందాయి.
()జిల్లాల విభ‌జ‌న కేసీఆర్ త‌న ఫాంహౌజ్‌లో కూర్చొని తీసుకున్న నిర్ణ‌యాలే. సైంటిఫిక్‌, శాస్త్రీయ‌బద్దంగా, క్షేత్ర‌స్థాయిలో ఉన్న‌టువంటి మండ‌ల‌, రెవెన్యూ, త‌హ‌శీల్దార్‌లు త‌యారు చేసిన నివేదిక కాదు
()హయత్ నగర మండ‌ల వాసుల‌కు ఇప్పుడు 10 కిలోమీట‌ర్ల దూరంలో క‌లెక్ట‌రేట్ ఉంద‌ని.... కానీ శంషాబాద్‌ను జిల్లాగా చేయ‌డం వల్ల  క‌లెక్ట‌రేట్‌కు వెళ్లాలంటే 40 కిలోమీట‌ర్లు వెళ్లాల్సి వ‌స్తుంది. కేసీఆర్ ఇదేనా ప‌రిపాల‌నా సౌల‌భ్యం..? 
()అఖిల‌ప‌క్ష స‌మావేశంలో చ‌ర్చించుకున్న‌దానికి, విడుద‌ల చేసిన డ్రాప్‌నోటిఫికేష‌న్‌కు పొంత‌న లేదు. రాష్ట్రంలో జిల్లాల విభ‌జ‌న‌కు తొంద‌రేమీ లేదు... ఎవ్వ‌రి కొంప‌లు అంటుకుంట‌లేవు. ఎందుకీ హడావిడి. 
()ప‌రిపాల‌న సౌల‌భ్యాన్ని వైయ‌స్సార్‌సీపీ స్వాగ‌తిస్తుంది.  చేసే విధానాన్ని మాత్ర‌మే వ్య‌తిరేకిస్తున్నాం
()మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని క‌ల్వ‌కుర్తిని రెవెన్యూ డివిజ‌న్ చేయాల‌ని గ‌త 20ఏళ్లుగా కోరుతున్నా  చేయ‌లేక‌పోవ‌డం దారుణం.
() ఉమ్మ‌డి రాష్ట్రంలో నాటి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తెలంగాణ‌కు చేసిన అభివృద్ధి త‌ప్ప కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిందేమీ లేదు
()ఓ వైపు సీఎం సొంత ఇలాకాలో అధికారుల వేధింపులు భ‌రించ‌లేక స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ రివాల్వ‌ర్‌తో క‌ల్చుకొని ఆత్మ‌హత్య చేసుకుంటుంటే... మ‌రోవైపు రైతులు ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతున్నారు. చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇదేనా బంగారు తెలంగాణ‌...?
()ఇప్ప‌టికైనా కేసీఆర్ స్పందించి త‌హ‌శీల్దార్ల నివేదిక‌ను తెప్పించుకొని ప్ర‌జ‌లక‌నుగుణంగా పరిపాల‌న చేయాలి.
Back to Top