ఓట్ల కోసం కేసీఆర్ కుల రాజకీయాలు

ఇబ్రహీంపట్నం: రైతులకు వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టోను పక్కకు పెట్టి ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసే హామీలు ఏమయ్యా యని ప్రశ్నించారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించినా, వాటిల్లోని అవకతవకలపై దృష్టి సారించడం లేదని రాఘవరెడ్డి విమ ర్శించారు. 
Back to Top