కష్టపడే కార్యకర్తకు పార్టీలో గుర్తింపు

విజయవాడ:

పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడే కార్యకర్తకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ పట్టణ కన్వీనరు గనిపిశెట్టి గోపాల్ స్పష్టం చేశారు. నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాట్లపై జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కార్యాలయంలో కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెవెళ్లేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్ పార్టీలో పట్టణ కన్వీనరు అవ్వలేకపోయానని పేర్కొన్నారు. వైయస్‌ఆర్ సీపీలో చేరిన ఐదునెలల్లోనే పట్టణ కన్వీనరుగా నియమితుడినయ్యానని చెప్పారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3గంటలకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో క్యాంప్‌బెల్‌పేట, కానూరు, గిలకలదిండి, పెదపట్నం, పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప, పల్లెతాళ్లపాలెం తదితర గ్రామాల నుంచి మత్స్యకారులు, వెనుకబడిన వర్గాల వారు పార్టీలో చేరేందుకు సంసిద్ధులయ్యారని చెప్పారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మాదివాడ రాము మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త జగన్మోహనరెడ్డిలా కష్టపడి పనిచేయాలన్నారు.  ప్రస్తుత రాజకీయాల్లో రాష్ట్ర ప్రజలు ఎక్కువశాతం వైయస్ఆర్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు చింతయ్య మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలను ప్రస్తుత పాలకులు మరుగునపెట్టారని విమర్శించారు.

Back to Top