కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు

హిందూపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి కుట్రలు పన్ని జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపారని వైయస్ఆర్‌ సీపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ (సీఈసీ) సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.  జగన్ బయటకొస్తే తమ పార్టీలకు పుట్టగతులుండవన్న భయంతోనే కాంగ్రెస్, టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఆస్తులను ఈడీతో అటాచ్‌మెంట్ చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జిల్లాలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ విషయంపై రైతు సంఘం సమర్పించిన నివేదికను చంద్రబాబు తిరస్కరించారన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నిం చారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్ప డం హాస్యాస్పదమన్నారు. వైయస్ఆర్ పీకి ప్రజ ల్లో మరింత ఆదరణ పెరుగుతోందన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఘన విజయమే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండూరు వేణుగోపాలరెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Back to Top